LPG eKYC Gas Cylinder Rules: దేశవ్యాప్తంగా LPG గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలకమైన సమాచారం వెల్లడించింది. 2026 అక్టోబర్ 1 నుంచి సబ్సిడీతో కూడిన గృహ LPG రీఫిల్ ను నియంత్రిత ధర (RSP) వద్ద బుక్ చేసుకోవాలంటే Biometric Aadhaar Authentication (BAA) తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. నకిలీ గ్యాస్ కనెక్షన్లను గుర్తించడం, సబ్సిడీ పథకం దుర్వినియోగాన్ని అరికట్టడం, అర్హులైన వినియోగదారులకే ప్రభుత్వ ప్రయోజనం అందేలా చూడటమే ఈ నిబంధన ఉద్దేశమని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
మంత్రిత్వ శాఖ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం, 2026 సెప్టెంబర్ 19 నాటికి 27.43 కోట్ల యాక్టివ్ డొమెస్టిక్ LPG వినియోగదారులు BAA పూర్తి చేశారు. ఇది మొత్తం వినియోగదారుల్లో 89.9 శాతం. ఇప్పటికే BAA పూర్తి చేసిన వినియోగదారులు మళ్లీ ఈ ప్రక్రియ చేయాల్సిన అవసరం లేదు. వారి LPG రీఫిల్స్ సాధారణంగానే కొనసాగుతాయి.
అక్టోబర్ 1లోపు eKYC చేయకపోతే ఏమవుతుంది?
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి – అక్టోబర్ 1, 2026 నుంచి Biometric Aadhaar Authentication పూర్తి చేయని వినియోగదారులకు సబ్సిడీ తో RSP వద్ద LPG Refill Booking ప్రారంభం కాదు. Authentication పూర్తయిన తర్వాత సబ్సిడీ తో Refill Booking సదుపాయం అందుబాటులోకి వస్తుంది.
అయితే eKYC చేయలేని వినియోగదారులు OMC వెబ్ పోర్టల్, మొబైల్ యాప్, WhatsApp Chatbot, IVRS వంటి డిజిటల్ మార్గాల ద్వారా తమ ఎంపికను నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా స్థానికగా లభించే 5kg లేదా 10kg LPG సిలిండర్లను మార్కెట్ ధరకు, సబ్సిడీ లేకుండా పొందవచ్చు.
LPG eKYC పూర్తి చేయడానికి అందుబాటులో ఉన్న మార్గాలు
వినియోగదారుల సౌకర్యం కోసం Biometric Aadhaar Authentication (BAA) పూర్తి చేసుకునేందుకు ప్రభుత్వం మూడు మార్గాలను అందుబాటులో ఉంచింది. మీకు సౌకర్యంగా ఉన్న విధానాన్ని ఎంచుకుని Authentication పూర్తి చేసుకోవచ్చు.
గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో
సిలిండర్ డెలివరీ చేసే సమయంలో డెలివరీ సిబ్బందిని సంప్రదించి, వారి వద్ద ఉన్న OMC మొబైల్ అప్లికేషన్ ద్వారా అక్కడికక్కడే Biometric Aadhaar Authentication పూర్తి చేసుకోవచ్చు.
గ్యాస్ ఏజెన్సీలో
మీ LPG డిస్ట్రిబ్యూటర్ లేదా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి అక్కడ అందుబాటులో ఉన్న బయోమెట్రిక్ పరికరం ద్వారా eKYC ని పూర్తి చేయించుకోవచ్చు.
OMC అధికారిక మొబైల్ యాప్ ద్వారా
ఇంట్లో నుంచే సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (OMC) అధికారిక మొబైల్ యాప్ ద్వారా self-authentication చేసుకోవచ్చు.
మొబైల్ యాప్ ద్వారా eKYC పూర్తి చేసే సులభమైన విధానం
మొబైల్ ద్వారా LPG eKYC చేయాలనుకునే వారు ముందుగా తమ వద్ద ఉన్న LPG కంపెనీకి సంబంధించిన అధికారిక యాప్ ను ఉపయోగించాల్సి ఉంటుంది.
- ముందుగా మీ LPG కంపెనీకి సంబంధించిన అధికారిక ఆప్ ను మీ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా యాప్లో లాగిన్ అవ్వాలి.
- యాప్లో మీ ప్రొఫైల్ లేదా సంబంధిత LPG సేవల విభాగాన్ని ఓపెన్ చేయాలి.
- అందుబాటులో ఉన్న eKYC / Aadhaar Authentication / Re-Verification ఆప్షన్ను ఎంచుకోండి.
- యాప్లో కనిపించే సూచనలను అనుసరించి ఆధార్ బయోమెట్రిక్ లేదా ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
- Authentication పూర్తయిన తర్వాత యాప్లో కనిపించే స్టేటస్ను చెక్ చేయండి.

ఇప్పటికే LPG eKYC విజయవంతంగా పూర్తి చేసిన వినియోగదారులు మళ్లీ ప్రక్రియను చేయాల్సిన అవసరం లేదు. అయితే సందేహం ఉంటే తమ సంబంధిత LPG కంపెనీ అధికారిక యాప్ లేదా గ్యాస్ ఏజెన్సీ ద్వారా eKYC స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు.
LPG eKYC కోసం అధికారిక OMC యాప్ లేదా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సేవలను మాత్రమే ఉపయోగించండి. తెలియని వ్యక్తులకు మీ ఆధార్ వివరాలు, OTP లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వవద్దు. అధికారిక ప్రక్రియలో అవసరమైన వివరాలను మాత్రమే సమర్పించండి.


Comments
No comments yet. Be the first to comment.