బ్యాంకుల సమ్మె వేళ ATM ఛార్జీల కు తాత్కాలిక మినహాయింపు | Bank strike Atm Charges Waived September-28-30-2026
సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ప్రతిపాదిత బ్యాంకుల సమ్మె రోజులలో ATM వినియోగదారులకు తాత్కాలికంగా ఊరట లభించనుంది. సమ్మె చేస్తున్న ఈ మూడు రోజులకు సాధారణంగా వర్తించే అదనపు ATM లావాదేవీ ఛార్జీలను మినహాయింపు ఇవ్వనున్నట్లు పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రకటించాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ తదితర బ్యాంకులు ఈ మినహాయింపును ప్రకటించినట్లు బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన తాజా సమాచారం ద్వారా తెలుస్తుంది. సమ్మె కారణంగా బ్యాంకు శాఖల్లో ప్రత్యక్ష సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ATM ఛార్జీలు ఉండవు
State Bank Of India వారి సమాచారం ఆధారంగా, సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో దేశంలోని ఏ బ్యాంకు ATM నుంచి లావాదేవీ చేసినా ఎటువంటి అదనపు ATM ఛార్జీలు ఉండవు (ATM Charges Waived). సాధారణంగా ఉచితంగా అనుమతించే ATM లావాదేవీల పరిమితి దాటినా తర్వాత ఈ మూడు రోజుల్లో ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా నగదు ఉపసంహరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అంటే SBI డెబిట్ కార్డు వినియోగదారులు SBI ATM లతో పాటు ఇతర బ్యాంకుల ATM లను ఉపయోగించినా వారికి కూడా ఈ ప్రత్యేక మినహాయింపు వర్తిస్తుంది. పలు ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా తమ ఖాతాదారులకు ఇదే తరహాలో తాత్కాలిక వెసులుబాటు కల్పిస్తున్నట్లు సమాచారం.
ATM ఛార్జీలు ఎలా ఉంటాయి?
ప్రతి నెల బ్యాంకు ఖాతాదారులకు నిర్దిష్ట సంఖ్యలో ATM లావాదేవీలు ఉచితంగా ఉంటాయి. ఆ పరిమితి దాటిన తర్వాత చేసే లావాదేవీలకు బ్యాంకు నిబంధనల ప్రకారం ఛార్జీలు వసూలు చేస్తారు.
ఇప్పుడున్న SBI తాజా ఛార్జీల ప్రకారం, ఇతర బ్యాంకుల ATM లలో ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత నగదు ఉపసంహరణకు రూ.23తో పాటు GST ఉంటుంది. నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలకు రూ.11తో పాటు GST వర్తిస్తుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో కూడా ఇతర బ్యాంకుల ATM ల వద్ద ఉచిత పరిమితి దాటిన తర్వాత ఒక ఫైనాన్షియల్ లావాదేవీ కి రూ.23తో పాటు వర్తించే పన్నులు, నాన్-ఫైనాన్షియల్ లావాదేవీ కి రూ.11తో పాటు పన్నులు వసూలు చేస్తారు.
అయితే సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ప్రకటించిన ప్రత్యేక మినహాయింపు ఈ సాధారణ ఛార్జీలను ఆ మూడు రోజులకు వర్తించదు.
మూడు రోజుల బ్యాంకుల సమ్మెకు గల కారణం?
యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్త బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చారు. ఐదు రోజుల బ్యాంకింగ్ వారంతో పాటు ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై యూనియన్లు డిమాండ్లు చేస్తున్నాయి.
సమ్మెను విరమించాలని ప్రభుత్వం కోరినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం సమ్మెకు పిలుపు కొనసాగుతోంది. సెప్టెంబర్ 26, 27 తేదీలు వారాంతపు సెలవులు కావడంతో 28 నుంచి 30 వరకు సమ్మె కలవడంతో కొన్ని బ్యాంకింగ్ సేవలకు వరుసగా ఐదు రోజుల వరకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 27న పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు పనిచేసేలా చర్యలు.
వరుస సెలవులు, సమ్మె కారణంగా కస్టమర్లకు ఇబ్బందులు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, రీజినల్ రూరల్ బ్యాంకులు సెప్టెంబర్ 27, ఆదివారం సాధారణంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
అదే రోజు బ్యాంకు శాఖలు, ATM-linked Branches, Currency Chests పనిచేయడానికి RBI అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో శాఖలో చేయాల్సిన అత్యవసర పనులు ఉన్నవారు సెప్టెంబర్ 27న బ్యాంకు సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది.
ATM లతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు
సమ్మె సమయంలో బ్యాంకు శాఖల సేవలు అందుబాటులో లేకున్నా UPI, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి ఇతర డిజిటల్ సేవలు కొనసాగుతాయని బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన తాజా సమాచారం. సాధారణ డిజిటల్ లావాదేవీలకు వీటిని ఈ సేవలను ఉపయోగించవచ్చు.
నగదు అవసరం ఉన్నవారు ముందు జాగ్రత్తగా అవసరమైన మొత్తాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిది. సమ్మె సమయంలో ATM లు పనిచేసేలా చర్యలు తీసుకున్న, ప్రతి ATM లో నగదు లభ్యత ఒకేలా ఉండకపోవచ్చు.
అందుకని ఖాతాదారులు ముందుగా – బ్యాంకు శాఖలో ఉన్న పనులను వాయిదా వేయకుండా సెప్టెంబర్ 27 లోపు చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్, ఖాతాకు సంబంధించిన కొన్ని శాఖా సేవలు వంటి ముందుగానే కంప్లీట్ చేసుకోవాలి.
నగదు అవసరం ఉంటే సెప్టెంబర్ 28 నుంచి 30 మధ్య ప్రకటించిన ATM ఛార్జీ మినహాయింపును ఉపయోగించుకోవచ్చు. అదే సమయంలో UPI, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ చెల్లింపు మార్గాలను ఉపయోగించుకోవచ్చు.


Comments
No comments yet. Be the first to comment.