తాజా అప్‌డేట్
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

BSNL One Lakh Accident Insurance: ఈ 2 ప్లాన్లకు బీమా ప్రయోజనం

✍️ Written by Madhu Goud

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారులకు ఉపయోగపడేలా సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ టెలికాం సంస్థలకు గట్టి పోటీ ఇస్తూ, తమ కస్టమర్ల భద్రతకు పెద్దపీట వేస్తూ ఉచిత బీమా (Free Insurance) మరియు సైబర్ మోసాల కవరేజీ (Cyber Fraud Cover) ప్రకటించింది.

దేశంలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ పాటు ఇలా ఉచితంగా ఇన్సూరెన్స్ రక్షణ కల్పించడం ఇదే మొదటిసారి. ఇందుకోసం ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ (The Oriental Insurance Company) తో BSNL ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది.

లభించే బీమా ప్రయోజనాలు

ఈ కొత్త సదుపాయం ద్వారా కస్టమర్లకు రెండు రకాల రక్షణ ప్రయోజనం లభిస్తుంది:

  1. రూ. 1 లక్ష ప్రమాద బీమా (Accidental Death Cover): ఈ ప్లాన్లు కలిగి ఉన్న కస్టమర్ ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే, వారి కుటుంబానికి (నామినీకి) రూ. 1 లక్ష వరకు ఆర్థిక సహాయం అందుతుంది.
  2. రూ. 10,000 సైబర్ ఫ్రాడ్ కవరేజీ: ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా ఎక్కువగా మోసాలు జరుగుతున్న నేపథ్యంలో, కస్టమర్ల BSNL నంబర్ ద్వారా ఏవైనా సైబర్ మోసాలు (Cyber Frauds) జరిగి డబ్బులు పోగొట్టుకుంటే రూ. 10 వేల వరకు నష్టపరిహారం లభిస్తుంది.

ఏయే రీఛార్జ్ ప్లాన్ పై ఈ ప్రయోజనాలు అందుతాయి

BSNL తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రెండు స్పెషల్ టారిఫ్ వోచర్లు (STV) తీసుకొచ్చింది. ఈ కింద పేర్కొన్న ప్లాన్ లతో రీఛార్జ్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ ఉచిత బీమా వర్తిస్తుంది.

  • STV 202 ప్లాన్ (30 రోజుల వ్యాలిడిటీ): తక్కువ అమౌంట్ తో బీమా రక్షణ కోరుకునే వారికి ఇది ఉత్తమమైన ప్లాన్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి 30 రోజుల వ్యాలిడిటీతో పాటు 300 నిమిషాల ఉచిత వాయిస్ కాల్స్, 5 GB డేటా, మరియు 100 SMS లు లభిస్తాయి. దీనితో పాటు రూ. 1 లక్ష ప్రమాద బీమా, సైబర్ కవరేజ్ ఉచితంగా అందుతాయి.
  • STV 2449 ప్లాన్ (365 రోజుల వ్యాలిడిటీ): సంవత్సరం పొడవునా రీఛార్జ్ గొడవ లేకుండా ఉండాలనుకునే వారికి ఇది సూపర్ ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా 365 రోజుల పాటు అపరిమిత (Unlimited) వాయిస్ కాల్స్, రోజుకు 2 GB హై-స్పీడ్ డేటా, మరియు రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్ తీసుకున్న వారికి ఏడాది పొడవునా ఉచిత బీమా రక్షణ అందుబాటులో ఉంటుంది.

క్లెయిమ్ నిబంధనలు: ప్రమాద బీమాకు సంబంధించిన క్లెయిమ్‌ను 48 గంటల్లోపు, సైబర్ ఫ్రాడ్ ఘటనకు సంబంధించిన క్లెయిమ్‌ను 7 రోజుల్లోపు నివేదించాలి.

ఈ బీమా కవరేజీకి వర్తించే నిబంధనలు

ఈ ఉచిత బీమా సదుపాయాన్ని పొందడానికి వినియోగదారులు ఎలాంటి అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు, అలాగే ఎలాంటి అప్లికేషన్ ఫారం నింపాల్సిన పని లేదు. అర్హత ఉన్న STV 202 లేదా STV 2449 ప్లాన్‌తో రీఛార్జ్ చేసిన తర్వాత బీమా ప్రయోజనం అందుబాటులోకి వస్తుంది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, కవరేజ్ సాధారణంగా రీఛార్జ్ తర్వాత 24 గంటల్లో యాక్టివేట్ అవుతుంది. పాలసీ వివరాలు SMS ద్వారా పంపబడతాయి. బీమా కు సంబంధించిన క్లెయిమ్‌ The Oriental Insurance Company నిబంధనలు, అర్హత ప్రమాణాలకు లోబడి ఉంటాయి.

గమనిక: మీరు ఎంచుకున్న రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ (30 రోజులు లేదా 365 రోజులు) ఎంతవరకు ఉంటుందో, అంతవరకు మాత్రమే ఈ ఇన్సూరెన్స్ పాలసీ చెల్లుబాటు అవుతుంది. ప్లాన్ గడువు ముగిసిన తర్వాత తిరిగి రీఛార్జ్ చేసుకోకపోతే బీమా వర్తించదు.

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అందిస్తున్న One Lakh Accident Insurance సదుపాయం ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్ కు అదనపు ప్రయోజనంగా ఉంటుంది. తక్కువ ధరలో డేటా, కాలింగ్ సదుపాయాలతో పాటు ప్రమాద బీమా, సైబర్ ఫ్రాడ్ కవరేజీ లభించడం వల్ల అర్హత ఉన్న కస్టమర్లకు ఇది ఉపయోగకరమైనది. అయితే బీమా ప్రయోజనాలు సంబంధిత నిబంధనలు, అర్హత ప్రమాణాలకు లోబడి ఉంటాయని గుర్తుంచుకోవాలి.

Mana Telugu Updates
మీకు కావాల్సిన ప్రతి తెలుగు అప్‌డేట్ ఒకే చోట
✓ Free Updates • ✓ No Spam
JOIN →