జియో లో నెల రీఛార్జ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఎప్పటిలాగే డేటా, కాలింగ్ ప్రయోజనాలు (Benefits) నే చూసి రీఛార్జ్ చేసుకోకండి, ఎందుకంటే కొన్ని జియో ప్లాన్ లతో టు ఇప్పుడు సుమారు 4000 రూపాయల విలువ చేసే Canva Subscription కూడా ఉచితంగా లభిస్తోంది.
ఇది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి, You Tube వీడియోలు చేసే వారికి, థంబ్‌నెయిల్స్ డిజైన్ చేసేవారికి Canva ఎంతగా ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వారికి జియో తీసుకొచ్చిన ఈ భాగస్వామ్యం కంటెంట్ క్రియేటర్లకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది.
రిలయన్స్ జియో, ప్రముఖ డిజైన్ ప్లాట్‌ఫారమ్ Canva తో కలిసి అర్హత కలిగిన ప్రీపెయిడ్ కస్టమర్లకు ఏడాది పాటు ఉచిత Canva సబ్స్క్రిప్షన్ అందిస్తోంది. అయితే ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేమిటంటే జియోలో రీఛార్జ్ చేసే ప్రతి ఒక్కరికీ ఈ ఆఫర్ వర్తించదు. కొన్ని నిర్దిష్ట ప్లాన్లకు మాత్రమే ఈ ప్రయోజనం వర్తిస్తుంది.
Jio Canva Offer ఏ ప్లాన్లకు వర్తిస్తుంది?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రూ.349, రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్లు మాత్రమే ఈ ఆఫర్ అర్హత కలిగిన వాటిలో ఉన్నాయి. అలాగే రూ.349 లేదా అంతకంటే అధిక ధరతో రోజుకు 2GB హై-స్పీడ్ డేటా అందించే అర్హత కలిగిన ప్రీపెయిడ్ ప్లాన్లు కూడా ఈ ఆఫర్ పరిధిలోకి వస్తాయి.
అంటే కేవలం ప్లాన్ ధరను చూసి నిర్ణయం తీసుకోకుండా, మీరు రీఛార్జ్ చేయబోయే ప్లాన్‌కు Canva ప్రయోజనం ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Canva ఎలా ఉపయోగపడుతుంది?
ఇక్కడే ఈ ఆఫర్ ప్రత్యేకంగా మారుతుంది – Canva లో డిజైనింగ్ చేయడానికి పెద్దగా అనుభవంతో అవసరం లేదు. కాన్వాలో అందుబాటులో ఉన్న ఉన్న టెంప్లేట్లను తీసుకుని మీకు కావాల్సిన ఫొటో, పేరు, టెక్స్ట్ మార్చుకుంటే సరిపోతుంది.
ఉదాహరణకు YouTube కోసం థంబ్‌నెయిల్ కావాలంటే ఒక టెంప్లేట్ ఎంచుకోవచ్చు. Instagram కోసం పోస్టు కావాలంటే మరో టెంప్లేట్ తీసుకోవచ్చు.
అదే విధంగా..
- YouTube Thumbnails
- Instagram Posts
- Facebook Creatives
- Business Posters
- Logos
- Presentations
- Social Media Stories
- Videos
వంటి వాటిని కూడా తయారు చేసుకోవచ్చు. అందుకే రోజూ సోషల్ మీడియా కంటెంట్ తయారు చేసే వారికి Canva ఒక ఉపయోగకరమైన టూల్ గా పనిచేస్తుంది.
ప్రీమియం ఫీచర్ల సంగతి ఏంటి?
జియో అందిస్తున్న ఆఫర్ ద్వారా అర్హత కలిగిన వినియోగదారులకు సంబంధిత Canva ప్రీమియం ప్రయోజనాలను ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రీమియం టెంప్లేట్లు, డిజైన్ ఎలిమెంట్లు, ఫాంట్లు, స్టాక్ కంటెంట్ వంటి అదనపు ఫీచర్లు అందుబాటులో ఉండవచ్చు.
అయితే మీకు ఏ Canva ప్లాన్ లేదా ఏ ఫీచర్లు యాక్టివేట్ అవుతున్నాయో MyJio లో కనిపించే ఆఫర్ వివరాలను మాత్రమే తుది ఆధారంగా తీసుకోవాలి.
ఆఫర్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?
Jio Canva Offer కోసం ప్రత్యేకంగా ఏదైనా వెబ్సైట్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ముందుగా My Jio App లో చెక్ చేయండి.
Step 1: మీ ఫోన్లో ఉన్న My Jio యాప్ ఓపెన్ చేయాలి.
Step 2: అందులో Offers లేదా Vouchers విభాగంలోకి వెళ్లండి.
Step 3: Canva కి సంబంధించిన ఆఫర్ కనిపిస్తే దానిపై క్లిక్ చేయండి.
Step 4: అక్కడ ఇచ్చే సూచనల ఆధారంగా మీ Canva అకౌంట్‌తో లాగిన్ అవ్వండి.
Canva అకౌంట్ లేనివారికి కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. యాక్టివేషన్ పూర్తయిన తర్వాత Canva లోకి వెళ్లి మీ సబ్స్క్రిప్షన్ వివరాలను ఒకసారి చెక్ చేసుకోవడం ఈ ఆఫర్ మీకు యాక్టివేట్ అయిందో లేదో తెలుస్తుంది.
రీఛార్జ్ చేసే ముందు ఈ విషయం మర్చిపోవద్దు
ఇలాంటి ఆఫర్లు కనిపించగానే చాలామంది వెంటనే రీఛార్జ్ చేసేస్తుంటారు. కానీ ఇక్కడ అలా చేయడం కంటే ముందుగా మీ జియో నంబర్‌కు Jio Canva Offer కనిపిస్తుందా లేదా My Jio App లో చెక్ చేయడం మంచిది.
ఎందుకంటే అర్హత, అందుబాటులో ఉన్న ప్లాన్, యాక్టివేషన్ విధానం వంటి వివరాలు మీ అకౌంట్లో చూపించే ఆఫర్ నిబంధనలపై ఆధారపడి ఉండొచ్చు.
మొత్తానికి, జియో రీఛార్జ్ తో పాటు Canva వంటి డిజైన్ టూల్ ప్రయోజనం లభిస్తే, రీఛార్జ్ చేసుకునే వారికి ఇది అదనపు ప్రయోజనంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా YouTube, Instagram, Facebook కోసం రోజూ కంటెంట్ తయారు చేసేవారు మీ My Jio యాప్ లో ఈ ఆఫర్ ఉందో లేదో ఒకసారి చూసేయండి.
ఈ ఆఫర్‌ను పొందడానికి అర్హత కలిగిన యూజర్లు తమ Canva అకౌంట్‌తో ఆఫర్‌ను క్లెయిమ్ చేయాలి. ఇప్పటికే చెల్లింపు Canva సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తించకపోవచ్చు. పూర్తి నిబంధనలు Jio అధికారిక Offer Pageలో చూడవచ్చు.
Jio అధికారిక Canva Offer వివరాలు →

Comments
No comments yet. Be the first to comment.