తెలంగాణలో TG EAPCET 2026 BiPC Counselling సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. B.Pharmacy, Pharm-D, Biotechnology, Biomedical Engineering తదితర కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునీ అర్హత ఉన్న అభ్యర్థులు నిర్దేశించిన తేదీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది. తొలి దశలో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు వంటి దశలు పూర్తి చేయాలి.
ముఖ్యంగా వెబ్ ఆప్షన్ల నమోదుకు సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు అవకాశం ఇచ్చారు. అభ్యర్థులు తమకు కావలసిన కోర్సును, కళాశాలను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాలి. అనంతరం మెరిట్, అందుబాటులో ఉన్న సీట్లు, రిజర్వేషన్ తదితర నిబంధనల ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుంది.
తొలి దశ షెడ్యూల్ ఇదే
ఈ షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు ప్రతి దశను గడువులోపు పూర్తి చేయాలి. ముఖ్యంగా వెబ్ ఆప్షన్ల సమయంలో కోర్సు, కళాశాలల ప్రాధాన్యత క్రమాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి.
ఈ షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు ప్రతి దశను గడువు ముగిసే లోపు పూర్తి చేయాలి. ముఖ్యంగా వెబ్ ఆప్షన్ల నమోదు సమయంలో కోర్సు, కళాశాలల ప్రాధాన్యతను వరుస క్రమాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి.
TG EAPCET 2026 BiPC Counsellingలో అందుబాటులో ఉన్న కోర్సులు.
TG EAPCET 2026 BiPC కౌన్సెలింగ్ ద్వారా అర్హత సాధించిన అభ్యర్థులకు పలు ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
అవి ప్రధానంగా B.Pharmacy, Pharm-D, Biotechnology, Biomedical Engineering, Pharmaceutical Engineering కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
ముందుగా రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్
కౌన్సెలింగ్ లో ప్రక్రియలో పాల్గొనే అభ్యర్థులు ముందుగా అధికారిక TG EAPCET-B పోర్టల్‌లో ప్రాథమికంగా అవసరమైన వివరాలను నమోదు చేసి, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ ను బుక్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సెప్టెంబర్ 12 నుంచి 16 వరకు గడువు ఇచ్చారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడం మంచిది. స్లాట్ ను బుక్ చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను కొనసాగిస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో భాగంగా అభ్యర్థులు తమ కు కేటాయించిన హెల్ప్‌లైన్ సెంటర్, తేదీ, సమయానికి హాజరై అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించి వెరిఫికేషన్ చేసుకోవాలి.
వెరిఫికేషన్‌కు అవసరమైన పత్రాలు
అభ్యర్థులు వెరిఫికేషన్ కోసము అవసరమైన డాక్యుమెంట్స్ ను ఇంటి దగ్గరనే సరిచూసుకోని వెరిఫికేషన్ సెంటర్ కు వెళ్లడం మంచిది. సాధారణంగా వెరిఫికేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఇవే.
- TG EAPCET 2026 ర్యాంక్ కార్డు
- TG EAPCET 2026 హాల్ టికెట్
- ఆధార్ కార్డు
- SSC మార్కుల మెమో
- Intermediate మార్కుల మెమో
- స్టడీ సర్టిఫికెట్లు
- కుల ధ్రువీకరణ పత్రం, వర్తిస్తే
- ఆదాయ ధ్రువీకరణ పత్రం, వర్తిస్తే
- EWS సర్టిఫికెట్, వర్తిస్తే
- ఇతర ప్రత్యేక కేటగిరీలకు సంబంధించిన ధ్రువపత్రాలు
అభ్యర్థులు తమ కేటగిరీకి, కోర్సుకు వర్తించే అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న పత్రాల జాబితాను తప్పనిసరిగా పరిశీలించాలి.
తొలి దశలో Web Options తేదీలు
తొలి విడత సీట్ల కేటాయింపు.
వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తైన తర్వాత తొలి విడత ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 22లోపు జరగనుంది. ర్యాంక్, వెబ్ ఆప్షన్లు, సీట్ల లభ్యత, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. సీటు పొందిన అభ్యర్థులు అధికారిక పోర్టల్‌లో అలాట్మెంట్ వివరాలు చెక్ చేసి, ట్యూషన్ ఫీజు చెల్లించి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి.
అనంతరం ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుంది. సెప్టెంబర్ 25న రిజిస్ట్రేషన్, 26న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 26–27న వెబ్ ఆప్షన్లు, సెప్టెంబర్ 29న ఫైనల్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. సెప్టెంబర్ 29–30న ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసి, సెప్టెంబర్ 30–అక్టోబర్ 1 మధ్య కేటాయించిన కళాశాలలో ప్రత్యక్షంగా రిపోర్ట్ చేయాలి.
కౌన్సెలింగ్ ప్రక్రియ అనంతరం ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను అక్టోబర్ 2లోపు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు షెడ్యూల్లో పేర్కొన్నట్లు తాజా సమాచారం.
అధికారిక సమాచారం
కౌన్సెలింగ్ షెడ్యూల్, హెల్ప్‌లైన్ సెంటర్లు, కోర్సులు, కళాశాలలు, సీట్ల వివరాలు, వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు తదితర తాజా సమాచారాన్ని అభ్యర్థులు TG EAPCET-B అధికారిక కౌన్సెలింగ్ పోర్టల్‌లో తెలుసుకోవచ్చు. అలాగే, పూర్తి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారిక PDF లో కూడా చూడవచ్చు.
- అధికారిక కౌన్సెలింగ్ పోర్టల్: TG EAPCET-B Official Website
- కౌన్సెలింగ్ షెడ్యూల్: Official Counselling Schedule PDF
- కౌన్సెలింగ్ లేదా స్లాట్ బుకింగ్ సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురైతే అధికారిక వెబ్సైట్లో ఇచ్చిన హెల్ప్‌డెస్క్ నంబర్లు 7660009768, 7660009769 కు సంప్రదించవచ్చు. tgeapcethelpdesk2026@jntuh.ac.inకు ఇమెయిల్ ద్వారా కూడా సహాయం కోరవచ్చు.


Comments
No comments yet. Be the first to comment.