Scheme Information
| Scheme Name | పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన (PM Surya Ghar Muft Bijli Yojana) |
|---|---|
| Launched By | భారత ప్రధాని నరేంద్ర మోదీ (నాయకత్వంలో కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ - MNRE) |
| Launch Year | 2024 (ఫిబ్రవరి 13, 2024 న అధికారికంగా ప్రకటించారు) |
| Application Mode | ఆన్లైన్ |
| Official Website | Official Website |
| Apply Link | Apply Online |
| PDF Link | View PDF |
PM Surya Ghar Yojana Subsidy Benefits: మీరు మీ ఇంటి కరెంట్ మీటర్ రీడింగ్ చూసి “ఈసారి బిల్లు ఇంత ఎక్కువ వచ్చిందేంటి ” అని ఆశ్చర్యపోని వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ – వీటి వాడకం పెరిగిన కొద్దీ నెలవారీ కరెంటు బిల్లు భారంగా మారిపోతోంది. ఈ భారాన్ని శాశ్వతంగా తగ్గించుకునేందుకు మార్గంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (PM Surya Ghar Muft Bijli Yojana).
దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లకు సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్స్ నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత లేదా తక్కువ ఖర్చుతో విద్యుత్ ప్రయోజనం పొందేలా చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకం కోసం కేంద్రం ₹75,021 కోట్లు నిధులు కేటాయించడం జరిగింది. ఇది చిన్న పథకం కాదు, పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అమలవుతున్న జాతీయ కార్యక్రమం.
ఎంత సబ్సిడీ లభిస్తుంది?
ఈ పథకం సోలార్ సిస్టమ్ సైజ్ ను బట్టి సబ్సిడీలో మార్పు ఉంటుంది. ఈ పథకానికి సబ్సిడీని స్థిరమైన మొత్తంగా చెల్లిస్తారు.
1 kW
2 kW
3 kW+
మీ ఇంటి అవసరాన్ని బట్టి 4kW, 5kW సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు, కానీ కేంద్రం ఇచ్చే సబ్సిడీ మాత్రం ₹78,000 ఇస్తుంది. ఎక్కువ కెపాసిటీ తో పెట్టించుకోవడానికి అదనంగా అయ్యే ఖర్చు మొత్తం మీ జేబు నుంచే భరించాలి.
ఈ సబ్సిడీ అమౌంట్ Installation, Inspection/Verification, Commissioning ప్రక్రియ పూర్తైన తర్వాత అర్హత మేరకు CFA మీ బ్యాంక్ ఖాతాకు DBT ద్వారా జమ అవుతుంది. ఖచ్చితమైన సమయం రాష్ట్రం/DISCOM మరియు Application Processing పై ఆధారపడి ఉంటుంది
PM Surya Ghar Yojana అర్హులు వీరే?
ఈ PM Surya Ghar Yojana Subsidy పథకం అందరికీ వర్తించదు. కింది షరతులు తప్పనిసరిగా కలిగి ఉండాలి:
- దరఖాస్తు చేసేవారు భారతీయ పౌరసత్వం ఉండాలి.
- Grid-Connected Residential Electricity Connection ఉండాలి.
- సోలార్ పానెల్ ను ఎర్పాటు చేయడానికి అవసరమైన Rooftop కు/స్థల హక్కు లేదా అనుమతి అవసరం.
- సంబంధిత Electricity Connection వివరాలు Applicant వివరాలతో సరిపోవాలి.
- గతంలో ఇదే Rooftop Solar Installation కోసం కేంద్ర ప్రభుత్వ CFA పొందినట్లయితే మళ్లీ అదే Installationపై CFA అవకాశం లేదు.
సోలార్ పెట్టించుకోవడానికి ఏ ఖర్చు..
సోలార్ సిస్టమ్ పెట్టించుకోవడానికి అయ్యే ఖర్చు కంపెనీని బట్టి, క్వాలిటీనీ బట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది.
| సిస్టమ్ సైజ్ | మొత్తం ఖర్చు (సుమారు) | కేంద్ర సబ్సిడీ | సబ్సిడీ తర్వాత మీ ఖర్చు |
|---|---|---|---|
| 1 kW | ₹65,000 – ₹85,000 | ₹30,000 | ₹35,000 – ₹55,000 |
| 2 kW | ₹1,20,000 – ₹1,40,000 | ₹60,000 | ₹60,000 – ₹80,000 |
| 3 kW | ₹1,60,000 – ₹2,10,000 | ₹78,000 | ₹82,000 – ₹1,32,000 |
నెట్ మీటరింగ్ ఎలా పనిచేస్తుంది?
సోలార్ పెట్టిన తర్వాత ఇంటికి ఒక ప్రత్యేక నెట్ మీటర్ బిగిస్తారు. దీని పని విధానం సింపుల్‌గా ఇలా ఉంటుంది:
పగటిపూట
సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే కరెంట్‌ను ముందుగా ఇంటి అవసరాలకు వాడుకుంటారు.
మిగులు కరెంట్
ఇంటి అవసరానికి మించి ఉత్పత్తి అయితే అదనపు విద్యుత్ గ్రిడ్‌లోకి వెళ్తుంది.
రాత్రిపూట
సోలార్ ఉత్పత్తి లేని సమయంలో అవసరమైన విద్యుత్‌ను గ్రిడ్ నుంచి తీసుకుంటారు.
నెలాఖరులో
గ్రిడ్ నుంచి తీసుకున్న, గ్రిడ్‌కు పంపిన విద్యుత్‌ను మీటర్ ద్వారా లెక్కిస్తారు.
సోలార్ పై పెట్టుబడి ఎప్పటికి తిరిగి వస్తుంది?
సోలార్ ప్యానెల్స్ సాధారణంగా 25 ఏళ్ల వరకు మంచి పనితీరుతో పనిచేసేలా రూపొందిస్తారు. ఉదాహరణకు, 3 kW rooftop system మంచి పరిస్థితుల్లో నెలకు సుమారు 300–360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అయితే అసలు ఉత్పత్తి ప్రాంతం, సూర్యరశ్మి, ప్యానెల్స్‌పై నీడ పడుతుందా లేదా, సిస్టమ్ పనితీరు వంటి అంశాలపై ఆధారపడి మారుతుంది.
అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్లు
PM Surya Ghar Yojana Subsidy పథకానికి అప్లై చేయడానికి అవసరమయ్యే వివరాలు/పత్రాలు National Portal మరియు సంబంధిత DISCOM ప్రకారం మారవచ్చు. సాధారణంగా Electricity Connection వివరాలు, Bank Details, Identity/KYC వివరాలు మరియు Installationకు సంబంధించిన పత్రాలు అవసరం కావచ్చు.
- ఇటీవలి కరెంట్ బిల్లు కాపీ
- ఆధార్ కార్డ్ (మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉండాలి)
- బ్యాంక్ పాస్‌బుక్ లేదా క్యాన్సిల్డ్ చెక్ (సబ్సిడీ జమకు)
- ఇల్లు మీ పేరు మీద ఉందని చూపే ఇంటిపన్ను రశీదు లేదా రిజిస్ట్రేషన్ కాపీ
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది?
PM Surya Ghar Yojana అప్లికేషన్ ప్రక్రియ మొత్తం pmsuryaghar.gov.in వెబ్సైట్ ద్వారానే చేయాల్సి ఉంటుంది. దశలవారీగా చూస్తే:

వెబ్సైట్లో రిజిస్ట్రేషన్
pmsuryaghar.gov.in లో Consumer Loginపై క్లిక్ చేసి మొబైల్ నంబర్‌ను OTPతో వెరిఫై చేయాలి. తర్వాత అవసరమైన వివరాలతో ప్రొఫైల్‌ను సేవ్ చేయాలి.
వెండర్ ఎంపిక
వెండర్ మీ తరఫున అప్లికేషన్ చేయాలనుకుంటే ‘Yes’, మీరే చేయాలనుకుంటే ‘No’ ఎంచుకోవాలి.
సోలార్కు అప్లై చేయండి
‘Apply for Solar Rooftop’పై క్లిక్ చేసి రాష్ట్రం, జిల్లా, DISCOM, Consumer No. నమోదు చేసి ‘Fetch Details’ క్లిక్ చేయాలి.
Feasibility Approval
Approval వచ్చిన తర్వాత వెండర్‌ను ఎంపిక చేసి సబ్సిడీ కోసం బ్యాంక్ వివరాలు సమర్పించాలి.
సోలార్ ఇన్స్టాలేషన్
ఇన్స్టాలేషన్ పూర్తయ్యాక వెండర్ వివరాలను పోర్టల్‌లో సమర్పిస్తారు. వాటిని కన్స్యూమర్ వెరిఫై చేయాలి.
సబ్సిడీ పొందండి
Verification పూర్తయ్యాక ప్రక్రియ పూర్తైన తర్వాత DBT ద్వారా సబ్సిడీ మొత్తం బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.


Comments
No comments yet. Be the first to comment.