Pradhan Mantri Kisan Samman Nidhi - PM Kisan Information
| Scheme Name | ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (Pradhan Mantri Kisan Samman Nidhi - PM Kisan) |
|---|---|
| Launched By | భారత ప్రభుత్వం (Government of India) |
| Launch Year | 24 Feb 2019 |
| Financial Assistance | ఏడాదికి రూ.6,000 (Rs.6,000 Per Year) |
| Beneficiaries | అర్హత ఉన్న Landholding Farmer Families |
| Application Mode | ఆన్‌లైన్ / CSC కేంద్రాలు |
| Official Website | Official Website |
- ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు – Who Can Apply?
- అర్హత నిబంధనలు – Eligibility Requirements
- ప్రయోజనాలు – Benefits
- అవసరమైన పత్రాలు – Required Documents
- దరఖాస్తు చేయాల్సిన పద్ధతులు..
- Application Status Check
- Beneficiary Status Check
- Payment Status Check
- PM Kisan e-KYC ఎలా చేయాలి?
- Grievance / Complaint
- Farmer ID – రైతులకు ముఖ్యమైన సమాచారం
- PM KISAN పథకం 2030-31 వరకు కొనసాగింపు
- Pradhan Mantri Kisan Samman Nidhi – Relevant Links
- సంప్రదింపు సమాచారం
- Important Note
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (Pradhan Mantri Kisan Samman Nidhi – PM Kisan) కేంద్ర ప్రభుత్వ రంగ పథకం. 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకం కింద అర్హత ఉన్న రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని మూడు సమాన విడతల్లో రూ.2,000 చొప్పున DBT ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. తాజా సమాచారం ప్రకారం, కేంద్ర మంత్రివర్గం 2026-27 నుంచి 2030-31 వరకు PM-KISAN పథకాన్ని కొనసాగించేందుకు రూ.3.15 లక్షల కోట్ల మొత్తం ఆర్థిక కేటాయింపును ఆమోదించింది. వార్షిక సాయం రూ.6,000గానే కొనసాగుతుంది.
ఈ పేజీలో PM Kisan Status, Beneficiary Status, Payment Status, e-KYC, New Farmer Registration, అర్హత, అవసరమైన పత్రాలు మరియు అధికారిక లింకులకు సంబంధించిన తాజా సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు – Who Can Apply?
అధికారిక భూ రికార్డుల్లో సాగు చేయదగిన భూమి తమ పేరుతో నమోదై ఉన్న అర్హత కలిగిన రైతు కుటుంబాలు ప్రధాన మంత్రి కిసాన్ పథకం ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ పథకంలో రైతు కుటుంబం అంటే భర్త, భార్య, మైనర్ పిల్లలు (Husband, Wife, Minor Children) కలిసి సాగు భూమిని కలిగి ఉన్న కుటుంబంగా పరిగణిస్తారు. భూమి పరిమాణంతో సంబంధం లేకుండా అర్హత నిబంధనలు కలిగివున్న రైతు కుటుంబాలు ప్రయోజనం పొందవచ్చు.
అర్హత నిబంధనలు – Eligibility Requirements
ప్రధాన మంత్రి కిసాన్ పథకం కింద ఆర్థిక సాయం పొందాలంటే రైతులు ప్రభుత్వం నిర్దేశించిన అర్హత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఈ పథకం ప్రధానంగా సంబంధిత రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం భూ రికార్డుల్లో సాగు చేయదగిన భూమి తమ పేరుతో నమోదై ఉన్న అర్హత కలిగిన రైతు కుటుంబాల కోసం ఉద్దేశించబడింది.
ఎవరు అర్హులు?
- సంబంధిత రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం అధికారిక భూ రికార్డుల్లో సాగు చేయదగిన భూమి తమ పేరుతో నమోదై ఉన్న రైతు కుటుంబాలు ప్రధాన మంత్రి కిసాన్ప్రయోజనాలకు అర్హులు.
- పథకం ప్రకారం రైతు కుటుంబం అంటే భర్త, భార్య, మైనర్ పిల్లలు కలిసి సాగు భూమిని కలిగి ఉన్న కుటుంబం.
- భూమి పరిమాణంతో సంబంధం లేకుండా అర్హత నిబంధనలు పూర్తి చేసిన రైతు కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది.
- భూ రికార్డుల ధృవీకరణ, పథకం నిర్దేశించిన అన్ని నిబంధనలను పూర్తి చేసిన తర్వాత ప్రయోజనం అందుతుంది.
- భూమి యజమాని మరణించిన సందర్భంలో, భూ రికార్డుల ధృవీకరణ మరియు పథకం నిబంధనలకు లోబడి అర్హత ఉన్న వారసుల కుటుంబాలు ప్రయోజనం కొనసాగించవచ్చు.
ఎవరు అర్హులు కారు?
- సంస్థాగత భూస్వాములు.
- ప్రస్తుత లేదా మాజీ రాజ్యాంగ పదవులు నిర్వహించిన వ్యక్తులు.
- ప్రస్తుత లేదా మాజీ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్ర శాసన మండళ్ల సభ్యులు.
- ప్రస్తుత లేదా మాజీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, జిల్లా పంచాయతీ చైర్‌పర్సన్లు.
- కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs), స్వయంప్రతిపత్తి సంస్థలు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన అధికారులు, ఉద్యోగులు.
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), క్లాస్-IV, గ్రూప్-D ఉద్యోగులు పై ప్రభుత్వ ఉద్యోగుల మినహాయింపు నిబంధన నుంచి మినహాయించబడ్డారు.
- నెలకు రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ పెన్షనర్లు. అయితే MTS, క్లాస్-IV, గ్రూప్-D పెన్షనర్లు దీనికి మినహాయింపు.
- గత అసెస్‌మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులు.
- ప్రొఫెషనల్ బాడీలలో రిజిస్టర్ అయి, వృత్తిపరంగా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్‌లు.
- NRIలు (Non-Resident Indians).
- తమ పేరుతో సాగు చేయదగిన భూమి అధికారిక రికార్డుల్లో నమోదు కాని కౌలు రైతులు, సాగుదారులు.
- తండ్రి, పూర్వీకులు లేదా ఇతర కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న భూమిని సాగు చేస్తున్న రైతులు, ఆ భూమి చట్టబద్ధంగా తమ పేరుకు బదిలీ కాకపోతే.
ప్రయోజనాలు – Benefits
PM Kisan పథకం ద్వారా అర్హత ఉన్న రైతు కుటుంబాలకు:
- ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం.
- మూడు సమాన విడతల్లో రూ.2,000 చొప్పున చెల్లింపు.
- విడతలు సాధారణంగా ఏప్రిల్–జూలై, ఆగస్టు–నవంబర్, డిసెంబర్–మార్చి కాలాల్లో విడుదలవుతాయి.
- DBT ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ అవుతుంది.
- వ్యవసాయ ఇన్‌పుట్స్, పంట సాగు, ఇతర అవసరాలకు ఆర్థిక సహాయం.
- 2026-27 నుంచి 2030-31 వరకు పథకం కొనసాగింపు.
- ఈ కాలానికి రూ.3.15 లక్షల కోట్ల మొత్తం ఆర్థిక కేటాయింపు.
అవసరమైన పత్రాలు – Required Documents
PM Kisan పథకం నమోదు సమయంలో అవసరమయ్యే పత్రాలు/వివరాలు:
- ఆధార్ కార్డు
- ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్
- బ్యాంకు ఖాతా నంబర్
- IFSC కోడ్
- భూ యాజమాన్య రికార్డులు
- చిరునామా వివరాలు
- మొబైల్ నంబర్
- కేటగిరీ వివరాలు అవసరమైతే
- పుట్టిన తేదీ / వయస్సు
- వ్యవసాయ భూమి పరిమాణం
- Survey Number / Khata Number అవసరమైతే
- Khasra Number అవసరమైతే
ఆధార్ అందుబాటులో లేని ప్రాంతాల్లో వర్తించే నిబంధనల ప్రకారం ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్, NREGA Job Card లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను ప్రత్యామ్నాయంగా అంగీకరించే అవకాశం ఉంది.
దరఖాస్తు చేయాల్సిన పద్ధతులు..
Online ద్వారా PM Kisanకు దరఖాస్తు.
అర్హత ఉన్న రైతులు PM Kisan పథకానికి ఆన్‌లైన్‌లో New Farmer Registration ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం
- ముందుగా PM Kisan అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, New Farmer Registration ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- అనంతరం ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, రాష్ట్ర వివరాలు నమోదు చేసి OTP ధృవీకరణ పూర్తి చేయాలి.
- ఆ తర్వాత Rural Farmer లేదా Urban Farmer ఎంపిక చేసి, రైతు పేరు, తండ్రి పేరు, లింగం, కేటగిరీ, చిరునామా వంటి వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి.
- బ్యాంకు ఖాతా నంబర్, IFSC కోడ్‌తో పాటు భూమి వివరాలు, Farm Size, Survey/Khasra Number వంటి సమాచారం కూడా నమోదు చేయాలి.
- చివరగా అన్ని వివరాలను ఒకసారి పరిశీలించి దరఖాస్తును Submit చేయాలి. దరఖాస్తు పూర్తయిన తర్వాత వచ్చే Registration Reference Numberను భద్రపరచుకోవాలి.
- దరఖాస్తు అనంతరం సంబంధిత అధికారులు భూ రికార్డులు, అర్హత నిబంధనల ఆధారంగా వివరాలను పరిశీలిస్తారు.
- ఆమోదం పొందిన తర్వాత అర్హత ఉన్న రైతులకు DBT ద్వారా విడతలు జమ అవుతాయి.
CSC కేంద్రం ద్వారా PM Kisan దరఖాస్తు
- ఆన్‌లైన్‌లో స్వయంగా దరఖాస్తు చేసుకోలేని రైతులు సమీపంలోని CSC కేంద్రం ద్వారా PM Kisanకు నమోదు చేసుకోవచ్చు.
- ఇందుకోసం ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ నంబర్, భూమికి సంబంధించిన పత్రాలను వెంట తీసుకెళ్లాలి.
- CSCలోని VLE ద్వారా PM Kisan పోర్టల్‌లో రైతు వివరాలు నమోదు చేయించి, నమోదు చేసిన సమాచారాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత దరఖాస్తును Submit చేయాలి.
- అనంతరం దరఖాస్తు సంబంధిత అధికారుల పరిశీలనకు వెళ్తుంది.
- రైతు అర్హత, భూ రికార్డుల ధృవీకరణ పూర్తైన తర్వాత PM Kisanలో నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.
Application Status Check

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (Pradhan Mantri Kisan Samman Nidhi – PM Kisan) పోర్టల్‌లో అప్లికేషన్ స్థితి తనిఖీ చేయడానికి Know Your Status సదుపాయం ద్వారా రైతులు తమ నమోదుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. e-KYC స్థితి, Beneficiary వివరాలను కూడా ఈ సదుపాయం ద్వారా పరిశీలించవచ్చు.
Beneficiary Status Check
PM KISAN అధికారిక పోర్టల్‌లో Beneficiary వివరాలను పరిశీలించే సదుపాయం ఉంది. రైతులు తమ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన అధికారిక పోర్టల్‌లోనే PM Kisan Beneficiary Status వివరాలను తనిఖీ చేయాలి. అనధికారిక వెబ్‌సైట్లలో ఇచ్చే Beneficiary list లింకులను ఉపయోగించకండి.
Payment Status Check
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద అందించే ఆర్థిక సాయం DBT విధానంలో రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది. మీ Payment Status లేదా Beneficiary వివరాలను అధికారిక PM-KISAN పోర్టల్‌లోని సంబంధిత Know Your Status సదుపాయాల ద్వారా పరిశీలించవచ్చు.
చెల్లింపు జమ కాకపోతే ముందుగా Aadhaar వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు, భూ రికార్డులు, e-KYC వంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో పరిశీలించండి. Statusలో ఏదైనా సమస్య కనిపిస్తే, అధికారిక PM-KISAN పోర్టల్‌లో అందుబాటులో ఉన్న సంబంధిత సహాయ సదుపాయాలను ఉపయోగించవచ్చు.
PM Kisan e-KYC ఎలా చేయాలి?
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ప్రయోజనాలు కొనసాగాలంటే రైతులు e-KYC పూర్తి చేయడం అవసరం. ప్రస్తుతం e-KYC పూర్తి చేసుకునేందుకు OTP, బయోమెట్రిక్, ఫేస్ ఆథెంటికేషన్ వంటి పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
OTP ద్వారా e-KYC
- PM-KISAN అధికారిక పోర్టల్‌ను ఓపెన్ చేయండి.
- e-KYC ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
- ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPను నమోదు చేయండి.
- OTP ధృవీకరణ పూర్తయిన తర్వాత మీ e-KYC ప్రక్రియ పూర్తవుతుంది.
Biometric e-KYC
ఆన్‌లైన్‌లో OTP ద్వారా e-KYC చేయలేని రైతులు సమీపంలోని CSC లేదా State Seva Kendraను సందర్శించి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా e-KYC పూర్తి చేసుకోవచ్చు.
Face Authentication ద్వారా e-KYC
PM-KISAN Mobile App మరియు Aadhaar Face RD App సహాయంతో ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా కూడా e-KYC పూర్తి చేసుకునే అవకాశం ఉంది.
Grievance / Complaint
PM KISAN నమోదు, విడత చెల్లింపు, e-KYC, ఆధార్ ధృవీకరణ, Beneficiary Status లేదా ఇతర సమస్యలపై అధికారిక PM KISAN Portalలోని Help Desk – Query Form ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
ఫిర్యాదు చేయడానికి:
- ప్రధాన మంత్రి కిసాన్ అధికారిక పోర్టల్‌ను సందర్శించండి.
- Help Desk – Query Form ఎంపికను ఎంచుకోండి.
- Registration Number, Aadhaar Number, Account Number లేదా Mobile Number వంటి అవసరమైన వివరాలు నమోదు చేయండి.
- సమస్యను వివరంగా నమోదు చేయండి.
- వివరాలను పరిశీలించి Submit చేయండి.
- Reference Number వస్తే భవిష్యత్ కోసం భద్రపరచుకోండి.
Farmer ID – రైతులకు ముఖ్యమైన సమాచారం
Farmer ID అనేది రైతుల వివరాలు, భూమి మరియు వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని డిజిటల్‌గా గుర్తించడానికి ఉపయోగించే వ్యవస్థ. రాష్ట్రాన్ని బట్టి Farmer Registry ప్రక్రియ మరియు అవసరాలు మారవచ్చు.
- సంబంధిత రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం Farmer Registry Portal ద్వారా Farmer ID నమోదు చేసుకోవాలి.
- రైతు పేరు, భూమి వివరాలు, ఆధార్ తదితర వివరాలను అధికారిక రికార్డులతో అనుసంధానం చేసి ధృవీకరించవచ్చు.
- Farmer ID లేకపోతే ప్రధాన మంత్రి కిసాన్ తో పాటు ఇతర వ్యవసాయ సేవల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
- Farmer ID కోసం మీ రాష్ట్రానికి సంబంధించిన అధికారిక Farmer Registry Portal నే ఉపయోగించాలి.
PM KISAN పథకం 2030-31 వరకు కొనసాగింపు
కేంద్ర మంత్రివర్గం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (Pradhan Mantri Kisan Samman Nidhi – PM Kisan) పథకాన్ని 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. ఈ ఐదేళ్ల కాలానికి మొత్తం రూ.3.15 లక్షల కోట్ల ఆర్థిక కేటాయింపు చేయబడింది.
పథకం కొనసాగుతున్న కాలంలో అర్హత ఉన్న భూమి కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 చొప్పున మూడు విడతల్లో ఆర్థిక సాయం అందుతుంది. అయితే ప్రయోజనం పొందడానికి నిర్దేశించిన అర్హతలు, భూ రికార్డులు, e-KYC తదితర నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
తెలంగాణ రైతులకు సంబంధించిన Rythu Bharosa వివరాలను ఇక్కడ చూడండి →
Pradhan Mantri Kisan Samman Nidhi – Relevant Links
- Official Website: PM-KISAN Official Portal
- New Farmer Registration: New Farmer Registration
- Beneficiary Status: PM-KISAN Beneficiary Status
- Beneficiary List: PM-KISAN Beneficiary List
- Grievance / Complaint: PM-KISAN Grievance
- PM-KISAN Scheme Guidelines: Operational Guidelines – PM-KISAN
సంప్రదింపు సమాచారం
- PM-KISAN హెల్ప్‌లైన్ నంబర్లు:
- 155261
- 011-24300606
- 1800115526 — టోల్ ఫ్రీ
- 011-23381092
- 011-23382401
- శాఖ: వ్యవసాయం, సహకారం & రైతుల సంక్షేమ శాఖ
- చిరునామా: కృషి భవన్, న్యూఢిల్లీ – 110001.
Important Note
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (Pradhan Mantri Kisan Samman Nidhi – PM Kisan) కు సంబంధించిన రిజిస్ట్రేషన్, e-KYC, Beneficiary Status, Payment Status, Grievance వంటి సేవలను అధికారిక PM KISAN పోర్టల్ ద్వారానే వినియోగించండి. పథకం కింద అర్హత, భూ రికార్డులు లేదా ఇతర వివరాల్లో మార్పులు ఉంటే సంబంధిత అధికారిక వ్యవస్థలో వాటిని సరిచేయడం అవసరం.


Comments
No comments yet. Be the first to comment.